Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కృతజ్ఞతా ప్రేమాంజలులన్ -
మన ప్రభునకు చెల్లించెదము
విశ్వాస కవచము ధరింతుము -
అనుదినం ప్రభునందు జీవింతుము
1 క్రీస్తు ప్రభుని ప్రేమాంబుధిలో -
మన ఆత్మల సమర్పించెదము
రక్షణ పొందగ క్రీస్తు ప్రభుని -
స్తుతి గీతములతో పాడెదము
2. మన్నా వరములు పొందిన మనము -
మహిలో మన్ననలందుదము
జీవపు ఊటల క్రీస్తు బోధలు -
నిత్యము జగతిని చాటుదమూ
3. యేసు మరియ జోజేపుల -
పునీతుల దీవెనలందుదము
క్రీస్తు ప్రభుని బలియాగములో -
సమిధలమై ఇల భాసిల్లుదము