Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం-l1
కరములెత్తి నిన్ను నేను పిలుచు చుండగా
స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా
గాయపడిన హస్తముతో లేపుచున్నావా
రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా
(నా) జీవిత కాలమంతా నిన్నే స్తుతియింతున్
అల్లే..... అల్లేలూయ...... అల్లేలూయ
అల్లే..... అల్లేలూయ....... అల్లేలూయ
1. దారి తప్పి నేను వెళ్ళుచుండగా
ఇదిగో దారి దీనిలో నడువని చెప్పుచున్నావా
నీవు తప్ప నాకెవరున్నారనినే పలుకగా
మార్గం సత్యం జీవమై నే నున్నానంటావా
(నా) జీవిత కాలమంతా నిన్నే స్తుతియింతున్
2. భయము భీతితో అల్లాడుచుండగా -
నీ హస్తంతో జోకొట్టి నిదురపుచ్చేవా
ఎన్నెన్నో కలతలు నన్ను కలవరపరచినా
తల్లిగ నన్ను లాలించి నీవు ఊరట నిచ్చావా
(నా) జీవిత కాలమంతా నిన్నే స్తుతియింతున్