Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కరుణామయుని కమ్మని వేదం -
ప్రేమామయుని పరమ ప్రబోధం
అల్లెలూయ.... అల్లెలూయ....
అల్లెలూయ... అల్లెలూయ...
1. దుర్భర జీవన యానంలో -
జీవన రాగం పలికించి
దీనుల హీనుల దుస్థితిలో
కరుణా రసమును చిలికించే
2. అంధుల అతుకుల బ్రతుకులలో
దివ్య జ్యోతిని వెలిగించి
అల్పుల అధముల రోదనలో -
ఆశ్రయ నాదం వినిపించే....