Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1. కావవే అమ్మా కరుణతో రమ్మా
తావక దాసుని –తప్పులు నెన్నక
నీవు దేవునిగని నిఖిల జగంబు
బ్రోవగ దలచిన – పుణ్య చారిత్రిణి ll కావ ll
2. దేవి దావీదుని – దివ్య కులమున బుట్టి
పావన మూర్తితో – పెరిగిన దానవు
ఏ విధమున నన్ను – నేలు కొందువోగాని
శ్రీవర దాయిని – శ్రిత కల్ప భూజమా ll కావ ll
3. నిర్మలమైన ధర్మగుణశీల
కర్మము దేర్పవే – కన్య మరియమ్మా
మర్మము జేయక – మా మీద నెనరుంచి
యిర్మిని బ్రోవుమా – యమ్మరో మాయమ్మా ll కావ ll
4. దయగల మాతా – శ్రేయజన దాతా
భయమున వేడెద – నయగుణ వ్రాతా
ప్రియమున యేసుని బిడ్డనుగా జేసి
రయమున బ్రోవవే – రమణీమణి మా యమ్మా ll కావ ll