Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కృపా రసము గల తల్లి అమలోద్భవి
దయారసముగల తల్లి అమలోద్భవి
ఆ మధుర మా మా జీవమా మా శరణం వందనం
పరదేశులమైన యావ బిడ్డలం ll2ll
అమ్మ వందనం మరియమ్మ వందనం ll2ll
1 వ చరణం..
కొండపైన వెలసిన కరుణామయుని తల్లి
సముద్ర ఘోష స్తుతులకు పాత్రమైన మాత ll2ll
నిన్ను చూచి వేడుచున్నాము
నా కన్నీటి కనుమలతో ప్రలాపించి ఏడ్చుచున్నాము
ఓ మధురమైన కన్యకా మాపైన దయను ఉంచుము ll2ll
2 వ చరణం..
సిలువ చెంత నిలుచున్న దయారసముగల తల్లి
అవని యందు ఆర్తులకు అమ్మగా మారిన తల్లి
మిమ్ము జూచి వేడుచున్నాం
మీ పరిపూర్ణ ఫలములకై ప్రలాపించి వేడుచున్నాం
ఓ కనికరముగల కన్యకా మాపై దయను చూపుము
అమ్మ వందనం.. మరియమ్మ వందనం..