Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. కవికే అందని కావ్యమా
మలచలేని రూపమా
మానవాళి ఆదరువా
అద్భుతమైన మరియ
హృదయగానమా మధుర గీతమా
వరప్రసాద వాహిని- యేసుని జనని ||క||
1. నీ చల్లని చూపు నాపై ఉంచి
దీవించి నన్ను నడుపు
మీ మార్గములో కడవరకు
నీ చల్లని చూపు నా పై ఉంచి
నింపుము నా మనస్సును
మార్చునన్ను ప్రభు సాక్షిగ
అమ్మ మా మరియా
అమ్మ లూర్ధమాత ||4||
2. సుగుణాలరాశి మా మరియా
నిన్నుగాంచి కొలిచే భాగ్యము
ప్రసాదించు మారాజ్ఞీ
శరణు శరణు మా మరియా
శరణు కోరితి నినుమాత
కరుణించు మా జనని
అమ్మ మా మరియా
అమ్మ లూర్థుమాత ||4||