Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కోడూరుమాతా - ఆరోగ్యమాతా
దీవించి కాపాడు తల్లి ||2||
నీ సన్నిధానం స్వరలోక సదనం
ఆనంద సాగరమమ్మా ||2||
1. పయనించి దర్శించినావు
ఏలిజబేతమ్మను నీవు ||2||
ప్రియమార సేవించినావు
ప్రభు ప్రేమ చూపించినావు ||2||
ప్రభు ప్రేమ చూపించినావు ||కోడూరు||
2. కానాపల్లెలోన వివాహవిందున నీవు ||2||
లోటైన ద్రాక్షారసాన్ని
ప్రభుతోడ అందించినావు ||2||
ప్రభుతోడ అందించినావు ||కోడూరు||