Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కోట్లాది ఐశ్వర్యం నాకు ఉండిన -
అయ్యా నాకు దొరికిన
నీవు లేక నా జీవితం శూన్యమే కదా
అభిషేకించు అభిషేకించు -
ఆత్మలో ఎదుగుటకు అభిషేకించు
శూన్యమే కదా శూన్యమే కదా -
నీవు లేక యేసయ్యా శూన్యమే కదా
1. సలోమోను ఐశ్వర్యం కోరుకోలేదు -
ఆయుష్చును కావాలని అడగలేదుగా
జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే -
(నీ) జ్ఞానవరముతో నన్ను అభిషేకించు
అభిషేకించు అభిషేకించు
ఆత్మతో ఎదుగుటకు అభిషేకించు
2. దానియేలు వైభవములో ఉండినకూడా -
ఆహారం కోసం ఆత్మను కోల్పోలేదే
ఆహారం కావాలని అడగలేదుగా
దర్శన వరం కోసం ప్రార్థించాడే-
దర్శన వరముతో నింపమన్నాడే
ఆ దర్శన వరముతో నను నింపుమా -
ఆ దర్శన భాగ్యమును దయచేయుమా