Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1. క్రొత్త యేడు మొదలు పెట్టెను
మన కొరకు నేడు క్రొత్తయేడు
మొదలు పెట్టెను క్రొత్తయేడు
మొదలు పెట్టెను కావుమని
మన కర్తనడుగ కూడి రండి
కూటమునకూ
కన్య మరియ సుతునివేడ ||క్రొ||
2. తప్పులను మన మొప్పు కొనువేళ
ఈ కొత్త వత్సర క్రొత్త
జీవము నొందెడివేళ
తప్పకను మొరబెట్టు వేళ
వరములడుగను వచ్చువేళ
పరమ దేవా సన్నిధిదిగో
పరుగు పరుగున రండి మీరు||క్రొ||
3. మాతృమూర్తిని మరియను వేడ
మనమందరమును మాత సన్నిధి
చేరుదము రండి-దేవమాతయే జగతి శరణం
దీనులను దీవించు తల్లి
దైవ సన్నిధి చేరవేయును
దైవ కృపనిల కుమ్మరించును ||క్రొ||