Type Here to Get Search Results !

క్షమాగుణ ( ksyamaguna Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


క్షమాగుణసంపన్నుడా - 

అనంత కరుణా సముద్రుడా ||2|| 

శరణాగత సంరక్షకుడా - 

లోకపాప పరిహారకుడా 

నను మన్నించుమయా ప్రభువా - 

క్షమ పాలించుమయా ||2|| 


1 వ చరణం.. 

కన్నులుండియు కబోదినైతిని-

కమ్మని రూపము కాంచనైతిని ||2|| 

వీనులుండియు చెవిటినైతిని-

జీవవాక్యము వినగనైతిని 

కఠినమైన నా హృదయము వలన-

స్వస్ధత ఎన్నడు పొందనైతిని 


2 వ చరణం.. 

స్నేహము మరచి సత్యము దెలిపి - 

సాక్ష్యము నీయగ బెదిరిపోతిని ||2|| 

స్వార్ధము పెరిగి ధనాపేక్షతో - 

స్వామి ద్రోహినై పతనమైతిని 

కఠినమైన నా హృదయము వలన - 

స్వస్దత ఎన్నడు పొందనైతిని


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section