Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కృపా సత్య సంపూర్ణుడా ||2||
కృపామయుడా..
కృప చూపుటే నీ సంకల్పమా ||కృపాసత్య||
1. నీ కృప నను విడువక
శాశ్వతముగా కాచెనుగా ||2||
మార్పులేని నీ మహాకృపలో ||2||
మహిమరాజ్యమున చేర్చుమా ||కృపాసత్య||
2. నీ కృప అభిషేక తైలమై
నా తలపై ప్రోక్షించినావు ||2||
నిత్యముండు నీ కృపతో ||2||
నిరతమునను గావుము ప్రభువా ||కృపాసత్య||
3. నీ కృప రక్షణ దుర్గమై
నా ముందర నడిచిన ప్రభువా ||2||
అడ్డుగా వచ్చు సాతాను బలమును
అంతమొందించెద నీ కృపతో ||కృపాసత్య||