Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
కృపామయుడా నీలోన - నివసింపజేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం ||2||
కృపామయుడా .....
1 వ చరణం..
ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక ||2||
నా మార్గము న్నిటిలోన
నీవే నా కాశ్రయమైనందునllకృపాll
2 వ చరణం..
చీకటి నుండి వెలుగులోనికి
నన్ను నడిపిన తేజోమయా ||2||
రాజ వంశములోన
యాజకత్వము చేసెదనుllకృపా||