Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
కృపగల దేవుడా పావన ఆత్ముడా !
వరప్రసాదుడా ప్రేమ స్వరూపుడా !
1 వ చరణం..
మనస్సున నివసించు ప్రేరణ కలిగించు
దేవుని సేవలో అనుదినం నడిపించుllకృపll
2 వ చరణం..
సత్య బోధలను నాకు ఎరిగించు
విశ్వాస వరమును నాలో పెరిగించుllకృపll
3 వ చరణం..
వ్యాధులన్ గుణపరచు నన్ను బలపరచు
శోధన శక్తులన్ నా నుండి తొలగించుllకృపll