Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కృతజ్ఞత స్తోత్రముతో నా ప్రభుని కీర్తింతును
జీవిత కాలమంత స్తుతులను చెల్లింతును
రాజాధి రాజ నా స్నేహనాధ
ప్రణమిల్లి నీకు నీ నామమునే
రేయిపగలూ ప్రసుతి చేసెదన్ ||కృత||
1. ఆయన చేసిన మేలులను
మరువక స్మరియింతును
ఆయన చూపిన కృపలకు
నిరతం స్తుతియించి పొగడెదను
యేసువే సత్యమై మార్గము జీవమై
జీవితమంత నడిపించిన
నా ప్రాణ స్నేహమై ||రాజాధిరాజ|| ||కృత||
2. కరుణామయుడగు యేసుని కోసం
నిరతం జీవింతును
సిలువలో రుధిరము చిందిన ప్రభునికి
సాక్షినై బ్రతికెదను
పావనం, పూజితం క్రీస్తుని నామము
రాగ రంజిత నవ్యమైనది స్వార్దక నామము
||రాజాధిరాజ|| ||కృత||