Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: పరిశుద్ధాత్మ సన్నిధి - 4
ప కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం
ధ్యానింతును నీవాక్యమును దేవా ప్రతిక్షణం||2||
నిరంతరం నీ నామమునే గానము చేసెదను||2||
ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదనూ IIకూII
1. ప్రతి విషయం నీ కర్పించెద
నీ చిత్తముకై నే వేచెద ||2||
నీ స్ఫూర్తిని పొంది నే సాగెద ||2||
నీ నామమునే హెచ్చించెద ||2||
నా అతిశయము నీవే
నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే
నా ఆధారము నీవే
యేసు....యేసు...యేసు....యేసు...
2. ప్రతిదినము, నీ ముఖకాంతితో
నా హృదయ దీపం వెలిగించెద ||2||
నీ వాక్యాను సారం జీవించెద ||2||
నీ ఘన కీర్తిని వివరించెద ||2||
నా దుర్గము నీవే -నా ధ్వజము నీవే
నా ద్వారము నీవే - నా దర్శనము నీవే
యేసు....యేసు...యేసు....యేసు...