Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
కృపయు సత్యము కలసి వెలసెను క్రీస్తురాజుగా
మహిమ రూపం మనిషి ఆయెను బాలయేసుగా
హల్లెలూయ హల్లెలూయ (4)
1 వ చరణం..
ప్రవచనం పరిపూర్ణమై కాలము సంపూర్ణమై
సకల ప్రజలకు రక్షణై సంతస వార్తయై llహల్లెll
2 వ చరణం..
గ్రుడ్డివారికి దృష్టియై బాధితులకు విమోచనమై
బీదలకు సువార్తయై రక్షణ మార్గమై llహల్లెll
3 వ చరణం..
నిత్యుడైన తండ్రియై సత్యమునకాధారుడై
శాంతికి నిలయమై నిత్య జీవమై llహల్లెll