Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సరి సరిగమ పదప - దరిగమ పదనిసని
పమ పదనిస రిగరి
గరి సనిద నిసనిదపమగరిస......
కృతజ్ఞత హృదయంతో తెచ్చాము దేవా
మా శ్రమ ఫలములు-మా జీవిత కానుకలు
స్వీకరించు తండ్రీ-మా చిన్ని కానుకలు
ఆత్మీయ హృదయంతో అర్పించుచున్నాము
||కృతజ్ఞత||
సనిదని సనిదని సనిదని స
పమగమ పమగమ పమగమ ప
ధిరన తోంత ధిరన తోంత ధిరన
1. జగమంత నీ సృష్టి-నీ స్వంతమే
మనుజాళి బ్రతుకంత-నీ ఆధీనమే ||2||
(దేవా) సర్వం నీవిచ్చిన వరములే ||2||
అర్పింతు నిరతం మా జీవితం ||2|| ||స్వీక||
2. అనుదినము స్మరియింతు నీ ప్రేమలో
ఆనంద హృదితో...నిను ధ్యానింతుము ||2||
(దేవా) నీ దివ్యసుతుని కల్వరి యాగముతో ||2||
మా చిన్ని హృదయాలు అర్పింతుము ||2||
||స్వీక|| ||కృతజ్ఞత||