Lyrics: Fr. Dusi Devaraj
Tune: Fr. D.V. Prasad
Music: Dattatreya
Album: జీవశృతి - 2
ఏ మవను స్వామీ నీ సేవకై
ఏ రూపుదాల్చ ను నీ పూజకై
1 వ చరణం..
పువ్వును గానా పత్రము గానా
ఫలమును గానా హారతి గానా
దివ్వెను కానా నైవేద్యముగానా
నీ పీఠము చేరే కానుకలుగానా llఏ మవను ll
2వ చరణం..
అప్పము గానా రసమును గానా
పీఠము గానా అర్చన గానా
దానము గానా అర్పణ గానా
నీ పూజలు చేసే పూజారిణి గానా llఏ మవను ll