Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1. ఓ దేవా మహాదేవా, నీ ఆద్భుత చర్యలను
దివ్యసంస్కారముల పండింతురు మాయెదలో
బహుళార్థ సాధకముల మహితాశీర్వచనముల
నవజీవన పూరములౌ సంజీవి ఫలములుగా
2. నీ కరుణ ప్రసాదముగా జలములు మా కొరకై
ఉపయోగము లెన్నెన్నో ఏర్పడగ నొసగి భువికి
సృజియించితిరో స్వామి యీ జగమున బప్తిస్మ
దివ్యసంస్కారమును నీ వరముగ ఆనాడు
3. విశ్వోదయమునకు ముందే
నీ ఆత్మ జలముపై వరలె
నీ శక్తిచేత జలముల్
వెలుగొందె దివ్యప్రభతో
ఆ ప్రళయజలమునందే
మరుజన్మ ప్రసాదించే
బప్తిస్మ వరమో దేవా, సూచింప జేసినారు
4. అబ్రాహాము సుతులు నీదు
కృప నెల్లసంద్రము దాటి
ఫరో దాస్యము వీడి-స్వేచ్చ నొంది రానాడు
బప్తిస్మ వరము పొంది
ధరలోని ప్రజకు వారు
ఆ నాటి నుండి దేవా,
గురుతై నిలిచినారు
5. జ్వాన్నేసుచే నీ సుతుడు
బప్తిస్మ వరమును పొందె
భవధీయమౌ పవిత్రాత్మ
అభిషేకమున ప్రభుద్దుడాయె
వ్రేలాడి సిలువ స్రవియించె
ధారలుగ రక్త జలము
పాపక్షతి పుణ్యోద్భవము
ఒక ధాతువులో వెలయించె
6. ఉత్థానమైన ప్రభువు
బోధింపు మనిరి శిష్యులను
పవిత్రాత్మ పిత పుత్ర
నామమున మనుజ జాతికి
బాప్తిస్మ మొసంగు మనిరి
నీ సుతుని దయాదృష్టి
నీ సత్యసభకు బాప్తిస్మ జల మీయ శక్తినిమ్మా
7. పవిత్రాత్మ జలముల శక్తి-ప్రక్షాళితుడై నరుడు
బాప్తిస్మ శుద్ధినొంది - ప్రతిరూపముగా వెలిగే
పునర్జన్మ గాంచి వెలయు
పరిశుద్ధ నవ్యశిశువై
దివ్యసంస్కారము - కావగ నెల్ల ధరణి
8. ఓ సర్వేశ్వరా, నీ సుతునిద్వారా
పవిత్రాత్మ వరప్రసాద ధార
నిండుగాక జలపూర్ణ కలశము
ఈ అద్భుత కార్యము విలసిల్లును నీ కరుణ
9. భవదీయ మరణమ్మున కీరీతి
గురుతైన బప్తిస్మమున
నీకై భూస్థాపితులై వేచిన ప్రజలందరును
నీతోనే జీవమునంది లేవగ భువిపై మరల
ప్రార్థింతుమో మిమ్ము క్రీస్తు ద్వారా దేవా
10. ఓ సర్వ మానవులారా
సర్వేశ్వర మహిమములు
మృధు మధుర గీతముల
మదిపొంగ పాడుడెపుడు
ఓ సర్వజలమ్ములు మీరు-సర్వేశ్వర లీలలను
ఆశ్చర్య మొంద సృష్టి-స్తోత్రమ్మును చేయుడి