Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
ఓ నా ప్రియుడా నీకే వందనం
ఓ నా రక్షకా నీకే స్తోత్రం
నీదు దివ్య రక్తంతో వెనిచ్చి కొనబడిన
నీదు బిడ్డను నేను నా యేసయ్యా
అల్లెలూయా ... అల్లెలూయా .... ||2||
1 వ చరణం..
విముఖలమై నశించు వారము కాము
విశ్వాసముచే మేము జీవించెదం
శోధనగాని ఈ లోక వేదన గాని
నీదు ప్రేమ నుండి మమ్ము వేరుపరచలేవు
మరణమును గెలిచిన మహా దేవుడా
సైతానును జయించిన సర్వశక్తుడా
అల్లెలూయా .... అల్లెలూయాllఓ నాll
2 వ చరణం..
నీదు ప్రేమ ఎండిపోలేదయా
నీదు కరుణ ఆరిపోలేదయా
ప్రతి ఉదయం నిన్ను వెదకు వారికి
వర్షం వలె నీ కృప కుమ్మరింతువు
కుమిలిపోవు ఆత్మను రక్షించు దైవమా
పాప కూపం నుండి నన్ను లేవనెత్తుమా
అల్లెలూయా .... అల్లెలూయా ....llఓ నాll