Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ బాలయేసువా ప్రియమైన దైవమా
మాలోన నిత్యం నీవుండి కావుమా
శరణు శరణు శరణం ||4||
శరణు శరణు శరణం ||2||
1. అండదండ లేనివారికి అండగ నీవు వుంటావు
గుండె గూటిలో దాగిన బాధను నిండు గుండెతో తొలగిస్తావు
మాతోకూడా వుండుము దైవమా ||2|| ||శరణ||
2. ఆశగ నిన్ను చేరువారికి ఆశాదీపిక అవుతావు
ఆరాధించే వారెల్లరిని తల్లి దండ్రిగ లాలిస్తావు
మాతోకూడా వుండుము దైవమా ||2|| ||శరణ||