Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి : నన్ను అధికముగా ఆరాధించువారిని -
నేను అధికముగా దీవించెదను
నన్ను అధికముగా ఆరాధించు వారిని
నేను అధికమధికముగా దీవించెదను
పల్లవి: ఓ యేసు ప్రభువా మీ దివ్య బాల్యమును
కొనియాడెదము మేము కొనియాడెదము
మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా
1. జగతిలోన నీకు జన్మనిచ్చు తల్లిగా
ఆదిలోనే మరియను ఎన్నుకొన్న బాలుడా
2. మరియ గర్భాన నవమాసాలు వసియించి
మా జన్మ వైనాన్ని దీవించిన బాలుడా
3. అవసరతలో ఆదుకొనే మరియ గర్భాననే
ఎలిశమ్మను శిశువును అలరించిన బాలుడా
4. సర్వోన్నతుడవై సర్వశక్తి మంతుడవై
పసికందువుగా జన్మించిన బాలుడా
5. పశువుల పాకలో పవళించిన పావనుడా
కాపరులారాధనలను అందుకున్న బాలుడా
6. జ్ఞానమౌ సత్యమౌ సర్వలోక పాలకా
రారాజుల ప్రణామములు అందుకున్న బాలుడా
7. సర్వశాసనాలకు అతీతుడవైనను
సాంప్రదాయ రీతిలో సున్నతి పొందిన బాలుడా
8. సృష్టిలోని సర్వము నీకే సొంతమైనను
ఆలయములో కానుకగా అర్పితమైన బాలుడా
9. హేరోదు చెరనుండి పలాయనమైనపుడు
హింసింతుల వేదనలను అనుభవించిన బాలుడా
10. ఏడు వత్సరాలు ఈజిప్టు దేశాన
పరదేశుల ఇక్కట్లను చవిచూచిన బాలుడా
11. నీదు తండ్రి చిత్తమును నెరవేర్చ దీక్ష బూని
ఈజిప్తును వీడిన నజరేయుడైన బాలుడా
12. వేదవేదాంగుల వేదికనాశీనుడవై
రక్షణ పరమార్థమును ప్రకటించిన బాలుడా
13. అమ్మను నాన్నను వినయముతో విధేయించి
జ్ఞానమందు ప్రాయమందు వర్ధిల్లిన బాలుడా