Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా
ఏమేమి చేయుచుంటివో తప్పించు కొందువా
ఆ......ఆ......ఆ.....ఆ.
1. ఆ అంత్య తీర్పునందున
యేసు నీ రక్షకుడేమహా భయంకరంబగు
సింహంబుగా నుండు||ఆ||
2. మృతులైన ఘనులు -
హీనులు దేవుని ఎదుటను
ప్రతి వారు నిలిచి యుందురు
బ్రతికిన రీతిగనే ||ఆ||
3. గ్రంథాలు విప్పబడును
అందున్నవి చదువను
ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు
ఆ.....ఆ......ఆ.....ఆ... ఓ