Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
llపల్లవిll
ఓ దేవా అత్యద్భుత సత్ప్రసాద ll2ll
అత్యద్భుత సత్ప్రసాద ముందుండే దేవా
మీ ప్రేమావధులు దాట మేమందున- మునక లిడగ ll2ll
1
మీదుసృష్టి రక్షణ ల అద్భుత ప్రేమను చూపుచు
మమ్ము మీది స్వంతముగా ముదమున చేకొంటిరి
నేడే మాయందు నివాసము చేయగ వచ్చితిరి
అప్ప ద్రాక్షారస గుణముల రెమ్మల వలే మేము మీతో ll ఓ.... ll
2
నిరతము మాకెల్లరకు ప్రప్రధాన గురువులై
మీ ప్రజ పై మీ దయ వరములు వర్షింపగా
అతి పురాతనమైన వేదాంతుల తో కూడిన
భారత భూమిపై జల్లుము- మీ దివ్యాశీస్సులనుll ఓ.... ll
3
మా యాత్మలో విశ్వసించి మా యాత్మలో ప్రేమించి
ఈ యద్భుత రహస్యం లోని సారమెరింగి
కల్వరిగిరిపై నిత్యము బలి యర్పణకై చేరగ
బాకు పోటు గాయము నుండి జీవజలము గ్రోలు చుండll ఓ.... ll