Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
ఓ దేవా నా బలమా - యదార్థమైనది -
నీ మార్గం - పరిపూర్ణమైనది మీ మార్గం
1. నా శత్రువులు నను చుట్టినను -
నరకపు పాశములరికట్టినను
వరదవలె భక్తిహీనులు - పొర్లిన -
విడువక నను యెడబాయని దేవా ||ఓ దేవా||
2. మరణపుటురులలో మరువక మొరలిడ -
ఉన్నత దుర్గమై - రక్షణ శృంగమై
తన ఆలయములో - నా మొర వినెను-
అదరెను ధరణి భయకంపముచే ||ఓ దేవా||
3. నా దీపమును వెలిగించు వాడు -
నా చీకటిని వెలుగగ జేయున్ జలరాసుల నుండి
బలమైన చేతితో -
వెలుపల జేర్చిన బలమైన దేవుడు ||ఓ దేవా||