Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ఓ జీవజలమా - సజీవ జలమా
అల్పుడనేను ఓదివ్యతేజమా ||2||
నాపై కురిపించు నీ ప్రేమధార ||2||
నా మది తాకి నడిపించుమా ||ఓ జీవ||
1. ఎలీషా ద్వారా నీ దివ్యస్వరము
ఉప్పుతో నీటిని పవిత్రపరచింది ||2||
యోర్దాను నదిలో మునిగినంతనే ||2||
నామాను కుష్ఠు మటుమాయమాయే ||2|| ||ఓ జీవ||
2. పవిత్ర జలముతో యేసుని స్నానం
తండ్రికి ప్రియునిగ ఇలమలచింది ||2||
ఆ జ్ఞానస్నానం పాపాన్ని బాపి ||2||
తన బిడ్డగా నన్ను ఇల మలచింది ||2|| ||ఓ జీవ||