Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: వరప్రసాదం
ప. ఓ పావుర రూపమా-పరిశుద్దాత్మా
మాపై దిగిరావా- మాపై దిగిరావా ||2||
1. ఆదిలో జలములపైన
తారాడినాత్మా దిగిరావా ||2|| ||ఓ||
2. ఎడారిలో ఇజ్రాయేలుల
నడిపిన ఆత్మదిగిరావా ||2|| ||ఓ||
3. దీర్ఘదర్శులను ప్రేరేపించిన
ప్రేషిత ఆత్మదిగిరావా ||2|| ||ఓ||
4, రాజులను అభిషేకించిన
పావనాత్మ దిగిరావా ||2|| ||ఓ||
5. నిర్మలమాతకు గర్భము నొసగిన
అద్భుత ఆత్మ దిగిరావా ||2|| ||ఓ||
6. యోర్దాను నదిలో యేసుని
తలపై దిగిన ఆత్మ దిగిరావా ||2|| ||ఓ||
7. శిష్యులలో తేజము నింపిన
సద్గుణ ఆత్మ దిగిరావా ||2|| ||ఓ||
8. అందరిలో ప్రేమను నింపే
దేవుని ఆత్మ దిగిరావా ||2|| ||ఓ||
9. మా హృదిలో శాంతిని నిలుపగ
పవిత్ర ఆత్మ దిగిరావా ||2|| ||ఓ||
10. విశ్వములో సఖ్యత కలుగ
శుభకర ఆత్మ దిగిరావా ||2|| ||ఓ||