Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1 వ చరణం..
ఓ ప్రార్ధనా సు ప్రార్థనా నీ ప్రాభవంబును మరతునా
నా ప్రభువున్ ముఖాముఖిన్ నే ప్రణుతింతునీ ప్రభున్
నా ప్రాణమౌ సుప్రార్థనా నీ ప్రేరణంబుచే గదా నీ ప్రేమధార గ్రోలుదున్ llఓll
2వ చరణం..
పిశాచి నన్ను యుక్తితో వశంబు చేయ చూచునో
నీ శాంతమైన దీప్తియే నాశంకలెల్ల మాపున్
నీ శక్తి నేను మరతునా శైలమైన ప్రార్థనా
నా శోకమెల్ల దీర్చెడు విశేషమైన ప్రార్థన llఓll
3 వ చరణం..
నీ దివ్యమైన రెక్కలే దుఃఖదార మెల్లను
నా దేవుడేసు చెంతకు ముదంబు గొంచం పోవును
సదా శుభం లొందుమా విధంబు జూప నీవేగా
నా ధైర్యమిచ్చు ప్రార్థనా సుధా సుధార ప్రార్ధనా llఓll