Lyrics: Rev. Fr. Johnson Chettur
Tune: unknown
Music: Kamalakar
Album: నీరాజనం
ఓయేసు దేవా నా ప్రాణ దాత
కరుణ చూపగ రావా ||2||
నీ ప్రేమతీరం కనలేని
నాకు వెలుగు పంచగరా
ఎండమావి దారిలోన నడకసాగెనా ||2||
1. అంతులేని బాధతోట
గూడుచెదరిన నిరాశ జీవిని
నీడ కరువై గుండె చెరువై
బండబారిన అనామకుడిని
భారమైన జీవితాన దారి చూపేవా ||2||
2. పాప జ్వాల రగులువేళ
బ్రతుకు నేడు విషాదమాయే..
ఆశలన్ని ఆవిరాయే
తీగ తెగిన విపంచినేను
కలతలున్న చీకటింట వెలుగువై రావా
కలతలున్న చీకటింట మమతవై రావా