Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ ఏసు దేవా నా ప్రాణ దాత కరుణ చూపగరా
నీ ప్రేమ తీరం కన లేని నాకు వెలుగు పంచగ రా
ఎండమావి దారిలోన నడక సాగేనా ll2ll llఓ ఏసుll
1 వ చరణం..
అంతులేని బాధ తోటి- గూడు చెదరిన నిరాశ జీవిని
నీడ కరువై గుండె చెరువై బండబారిన అనామకుడిని
భారమైన జీవితాన దారి చూపే వా ll2ll
2 వ చరణం..
పాప జ్వాల రగులు వేళ- బ్రతుకు నేడు విషాదమాయే
ఆశలన్నీ ఆవిరాయే తీగ తెగిన విపంచి నేను ll2ll
కలతలున్నా చీకటింట వెలుగైరావా
కలతలున్నా చీకటింట మమత వై రావాll2ll llఓ ఏసుll