Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఓ యేసుదేవా... నా ప్రాణ ప్రియుడా ||2||
అర్పింతునయ్యా...నా ప్రేమ హృదయం
రాజాధిరాజా...నా ప్రేమనాధా ||2||
కరుణించి ముదమార నను స్వీకరించు ||ఓ యేసుదేవా||
1. నన్ను మలిచి నీదు రూపమున
ప్రాణమొసగిన దైవమా
నా తనువు నా మనసు నీ స్వంతమే ప్రభూ ||2||
కరుణించి గైకొనుము ఈ పేదకానుక ||2|| ||ఓ యేసుదేవా||
2. మధురమైనది నీదు హృదయం
మమత లొలికే యేసువా ||2||
నీ వెలుగు నీ ప్రేమ-నా జీవితాశయే ||2||
బ్రతుకంత అర్పింతు నా ప్రాణదైవమా ||2|| ||ఓ యేసుదేవా||