Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ఓ యేసువా - మా రక్షకా ||2||
నా జీవితం - నీ కంకితం
నీ ప్రేమ నామగాన అమృతము
సేవించుచు తరించును ||2|| ||ఓ||
1. సృష్టిలోని జీవరాశుల అన్నింటికన్నా
ప్రకృతిలో ఉన్న అందచందాలకన్న ||2||
నన్నే మిన్నగా ఈ రూపులో మలిచిన దేవా||2||
నా జీవితం నీకంకితం ||2|| ||ఓ||
2. నీ జీవపు వాక్కు - నలుదిశల ప్రకటింప
ప్రేమతో నన్ను ఎన్నుకొనిన దేవా ||2||
నీ పద సేవలో నిరతం జీవించే ప్రభువా ||2||
నా జీవితం నీకంకితం ||2|| ||ఓ||