Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఊహకు అందని భోజ్యమిది యేసుని విందు
భువిలో దొరకని పానమిది పావన విందు ||2||
మన్నాను మించిన భోజ్యమిది
ముదమున యేసుని లోకన రారండి ||2||
సజీవ దేవుని దేహమిది
శ్రీయేసుని రుధిరమిది ||2||
1 వ చరణం..
వేకువనే హిమబిందువుగా కురిసిన మన్నా విందు
బీడులలో రుచికర పక్షుల మాంసాహారపు విందు ||2||
సీనాయి ఒప్పంద విందు
ఇది పరలోక దేవుని విందు ఇది ||2||
పోషించు జనకుని విందు
ఇది ప్రేమించు దేవుని విందు ఇది
2 వ చరణం..
ఓ చిన్న మందా భయమేలనీకని అభయము నొసగిన విందు
యావే జనమున దీనాతి దీనుల ఆకలి తీర్చిన విందు ||2||
ప్రభుయేసు స్నేహపు విందు
ఇదినూతన ఒప్పంద బంధమిది ||2||
మనుజాళి రక్షణ విందు
ఇది కలువరిలో క్రీస్తుని త్యాగమిది ||2||