Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఉదయ కాంతులు ప్రజ్వలిరిల్లెను -
ప్రేమ జ్యోతులు ప్రభవ మొందెను
ప్రభుని న్యాయము విధిత మాయెను -
న్యాయ తీర్పున ప్రేమ వెలయును
1. మృతులు మరల లేతురనుట -
ప్రభువు తెలిపిన పరమ సత్యము
దివ్య దేవుని నిత్య జీవము -
నీతిమంతులు పొందగలరు.
2. నీతి జీవులు నిత్య కాలము -
జీవ శాంతులు పొందగలరు
దేవ దేవుని మహిమ విభవము -
దీప్తి వెలుగును దీన ధనులకు
౩. మరణముల్లును క్రీస్తు విరిచెను
మంటిమనిషి మింటికెగెసెను
క్రీస్తు యేసును నమ్ము వారికి
మరణమెన్నడు అడ్డురాదిక ..ఉదయ ..
4.మరణ మొందిన క్రిస్తుయేసు
మరల లేచెను తిరిగి వచ్చెను
మరల రాగల ప్రభుని జేరను
మహిని మనము వేచి యుందుము..ఉదయ ..
4దూతగణముల దివ్య ప్రార్దన
పుణ్యధన్యుల పూజ ఫలములు
లోక జీవుల దీన కోరిక
మృతుల కొరకు చేరుచుండెను