Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఉత్సాహ గీతం పాడండి--
వధూవరుల మీరు దీవించండి
అనురాగంతో ఆశీస్సులతో -
అభినందించండి ఆనందంతో
1. ఆత్మీయుల ఆదరాభిమానాలతో -
ఆశీస్సులందుకొని అలరింపుమని
సాక్షులిరువురు సాదరంగ దీవించ -
సాగిరండి జీవిత నవోదయానికి
2. సమాజంలో ఇరువురు వికసింపగా -
దీవించిన గురువు ప్రధమ సాక్షిగా
ఆదరణ శ్రీసభ ఆదరించగా -
ఆనంద వీచికలు పెనవేయును
3. ఆలయాన వేసిన పవిత్ర బంధం -
దైవ సాక్షిగా నిలవాలి త్యాగ బంధం
దినదినం దేవుని చల్లని దీవెనలతో -
సాగాలి జీవన తీరాలకు