Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
వివాహ ఉత్సవ పూజావేళ -
పరమోన్నతుని పద సన్నిధికి
స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో
పరుగున రండి ప్రభు జనమా -
త్వరపడి రండి ప్రియ జనమా
రారండి వేడండి ప్రభు దీవెన పొందండి
ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి
1. ఏదేను తోటలో యావే దేవుడు -
ఆదాము ఏవల జతగా చేసెను
ఆ రీతిగానే వీరిద్దరిని -
ప్రేమబంధములో ఒకటిగా కూర్చెను
రారండి వేడండి కళ్యాణము చూడండి -
రారండి పాడండి ఈ జంటను దీవించండి.
2. దేవునిచే జతపరచిన జంటను -
మానవ మాత్రుడు విడదీయరాదని
వివాహ ఘనతను చాటిన ప్రభునికి -
స్తుతులర్పించగ రారండి
రారండి వేడండి కళ్యాణము చూడండి
రారండి పాడండి ఈ జంటను దీవించండి.