Type Here to Get Search Results !

ఉదయ కాంతులు ( udhaya kanthulu Song Lyrics | Jesus Songs in Telugu Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

ఉదయ కాంతులు ప్రజ్వలించెను 

ప్రేమ జ్యోతులు ప్రభవమొందేను

ప్రభుని న్యాయము విదితమాయేను

న్యాయ తీర్పున ప్రేమ వెలయును ||ఉదయ|| 


1 మృతులు మరల లేతురనుట

ప్రభువు దెలిపిన పరమ సత్యము

దివ్య దేవుని నిత్య జీవము 

నీతిమంతులు పొందగలరు ..||ఉదయ|| 


2 నీతి జీవులు నిత్య కాలము 

జీవ శాంతుల పొందగలరు

దేవదేవుని మహిమ విభవము 

దీప్తి వెలుగును దీనధనులకు ..ఉదయ .. 

౩ tమరణముల్లును క్రీస్తు విరిచెను 

మంటిమనిషి మింటికెగెసెను

క్రీస్తు యేసును నమ్ము వారికి 

మరణమెన్నడు అడ్డురాదిక||ఉదయ|| 


3 మరణ మొందిన క్రిస్తుయేసు

మరల లేచెను తిరిగి వచ్చెను 

మరల రాగల ప్రభుని జేరను

మహిని మనము వేచి యుందుము||ఉదయ|| 


4 దూతగణముల దివ్య ప్రార్దన

పుణ్యధన్యుల పూజ ఫలములు

లోక జీవుల దీన కోరిక 

మృతుల కొరకు చేరుచుండెను ||ఉదయ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section