Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1. ఉజ్వల కాంతులు నిండెను ఉన్నత స్వర్గము నందున
దూత గణములు ఆడెను దివ్యభేరి మ్రోగెను
పాస్కా వత్తి వెలిగెను - ప్రభల మించి మెరిసెను
దేవ రహస్యములెల్లా తేట తెల్లము ఆయెను
2. అంధకారములు మలిగేను అమర జ్యోతి ఇల వెలిగేను
మోద భరిత గానముల్ మేదిని ఎల్ల ధ్వనించెను
దివ్యనాధుని భవ్య తేజము వెన్నెలలై విరిసేను సృష్టియంతయు
దీప్తిమంతమై దివ్య కాంతిలో మెరిసేను ||ఉజ్వల||
3. సర్వేశ్వరుని దీప్తితో సత్య సభాస్థలి మించెను
భక్తకోటి మది పొంగగా ఆనంద గీతి పాడెను
దేవాలయము మ్రోగెను దైవ నిర్ణయము సాగెను
దేవ దేవుని కీర్తనల దివ్య ధ్యానము నిండెను ||ఉజ్వల||
4. స్వామి సేవా భాగ్యము ఏమి ఎరుగని నాకిది
పాస్కా విధుల దీర్పగ పరమ కరుణతో బ్రోచిన ప్రభుని
దివ్య జ్ఞాన ముదయించగా లోభితనము నశియించగా
సన్నుతించరే చేరినను దివ్య గీతము పాడరే ||ఉజ్వల||
5. అఖిలేసునకు ఋణపడిన ఆది నరుని పాపమును
రక్తధారలచే కడిగి ముక్తి మార్గము జూపెను
పాస్కా గొర్రెపిల్ల పరమ నాధుని పుత్రుడే
నిత్యము పితకు బలియగుచు సత్యము జూపే రక్షకుడు ||ఉజ్వల||
6. ఈ శుభాకర రాత్రిలో - ఇశ్రాయేలు జనావళి
సాధు గొర్రెపిల్లా రక్తధారల చిహ్నము కాగా
ఈజిప్టు దాస్యము వీడగాఎర్ర జలనిధిని దాటెను
దివ్య స్తంభము కాంతిలో -దేవ భక్తి విలసిల్లగా ||ఉజ్వల||
7. ఈజిప్టు దాస్యము బాపిన - స్వేచ్ఛామయమగు రాత్రి ఇది
పాపమెల్ల ద్రుంచిన పరమ పవిత్ర రాత్రి ఇది
పాతాళ భక్త కోటికి - వరము నొసంగిన రాత్రి ఇది
జయశీలుడైన స్వామికి జోహార్లిడిన రాత్రి ఇది ||ఉజ్వల||
8. ముక్తిని గాంచజాలని దీన మానవ జన్మము
నిత్యము పితకు దూరము నిక్కముగాను వ్యర్థము
నాధుని కరుణ మెండుగా ఈధరయందు నిండుగా
ఆది మనుజుని పాపమిది-వసరమై వరలెనుగా ||ఉజ్వల||
9. ఘనమైన పాపమా కనవోచి నారము
మంగళకర వరదాతను నాధుని మృత్యుంజయుని
నీవల్లనే ఈ రాత్రి నిక్కముగను మేమెల్ల
నీది భాగ్యము కంటివి ముందుగ స్వామిని ||ఉజ్వల||
10. దివ్య జ్యోతిలో రాత్రి పగలై ప్రకాశించే
ఫలించే పావన సూక్తి ధారుణి వెలుగొందె
ఉత్థానమైన ప్రభువు అరుదెంచిన ఉజ్వల వేళ
చూచి ధన్యమైన అనన్య శుభకర రాత్రి ||ఉజ్వల||
11. భువి పాపము బాపగా దివి భువిపై భాసిల్ల
ఈర్ష్య ద్వేషము తొలగంగ సమత మమత వెలయంగ
ప్రవహింప దేవుని కరుణ పులకించి ధరణి తరింప
బ్రోచిన మంగళ రాత్రిది అఖిలా భయ శుభధాత్రి ||ఉజ్వల||
12. నీదు కరుణా సృష్టిని నిరతము కోరే భక్తులు
అర్పణమ్ముల అర్చనల ఆనందోత్సవ స్తోత్రముల
పవిత్ర వత్తి సూచిగా వినూత్న తేజోమూర్తివై
నవ్య కీర్తితో భాసిల్లే ఓ తండ్రి చేకొనుమా ||ఉజ్వల||
13. అంతులేనిది నీ కరుణ ఆశ్రిత రక్షణ శుభచరణా
దైవ మనుజ సంబంధము దృఢమై ఘనమై వెలయంగ
గురుతుగ వత్తి వెలిగేను పరమ నాధుని రూపముగా
వేనవేలుగా విడివడిన వెలుగు నొక్కటే కాంతి ||ఉజ్వల||
14. దివ్యకాంతి వెదజల్లుచు - దశదిశల వెలుగొందుచు
చీకటి పారద్రోలుచు లోకములెల్ల బ్రోచును
పాస్కా జ్యోతి క్రీస్తుడు పితా పుత్ర లోక రీతిగా
రాజ్యము భువిపై చేతురు రాజిత తేజోమూర్తులై ||ఉజ్వల||