Telugu Christian Songs Lyrics
Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: ఉన్నతమునందు ప్రభువునకు
విమల మహిమ కలుగుతన్
భువిని నిర్మల మనసు కల్గు
ప్రజకు శాంతి వెలయుతన్
2. ధరయును గగనంబును
విభుని మహత్తున్ దెలిపెడిన్
స్వర్గంబు సన్మనస్కులును స్వామి
విశుద్ధ ఖ్యాతిపొగడెడిన్
3. అరుదగు మనుజుల విజ్ఞానంబు
సత్కీర్తిని గడించెడిన్
జనుల రక్షణ నిర్వహణంబు
రక్షకు కీర్తి నుతించెడిన్
4. కిల్బిషంపు పరిహర్తయగు
నెనరు గొర్రియ పిల్లకును
వరము జనక పరిశుద్ధాత్మలకును
మహిమ కలుగుతన్.