Type Here to Get Search Results !

ఉన్నతమున సర్వేశ్వరునికి ( unathamuna sarveshvaruniki Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Telugu Christian Songs Lyrics
Telugu Christian Songs Lyrics

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


గ్లోరియా గ్లోరియా గ్లోరియా గ్లోరియా ||2||

ఉన్నతమున సర్వేశ్వరునికి మహిమా ` మహిమా

భూలోక జనులు ` ఎల్లరకు శాంతి

ప్రభు ప్రేమ పాత్రు ఎల్లరకు ` సమాధానం కలుగును


1 వ చరణం.. 

పరలోకమేలే రాజా ` మమ్మేలే మా తండ్రి

సర్వశక్తిగల పితా ` విశ్వమంతయు మీదే

మిమ్ము పొగడగ వచ్చాము ` మిమ్ము స్తుతించుచున్నాము

మీ కీర్తి వైభవమునకై వందనము అర్పించుచున్నాము llఉన్నతll 


2 వ చరణం.. 

జనితైక సుతుడా ` ఏసుక్రీస్తువా ఏలినవారైన సర్వేశ్వరా

సర్వేశ్వరుని గొర్రెపిల్లా ` మా పితయొక్క పుత్రుడా

లోకపాప పరిహారకుడా ` లోకపాపము నెల్ల 

పరిహరించి మాకు ` దయచూపండి llఉన్నతll 


3 వ చరణం.. 

పితయొక్క కుడి ప్రక్కన ` కూర్చొని యున్నవారా

పరిశుద్ధు మీరొక్కరే ` మాకు దయచూపండి

తండ్రి మహిమలో పవిత్రాత్మతో ` సర్వకాలము నుండువారా

పితయైన సర్వేశ్వరుని ` మహిమలో నుండువారా llఉన్నతll 

ఆమెన్‌.....ఆమెన్‌....... ఆమెన్‌.....ఆమెన్‌..... ||2||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section