![]() |
Telugu Christian Songs Lyrics |
Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప|| ఉత్థాన క్రీస్తుని మహోత్సవ వేళ
మన మనసులు మురిసే ఈ శుభవేళ
ప్రేమతో మేమొసగే ఈ అర్పణలు
స్వీకరించుమా ఆశీర్వదించుమా ||ఉత్థాన||
1. ఆదాము పాపము బాపగా నీవు
ప్రాణము దానము మాకొసగినావు
మృత్యుంజయునిగా ఇల నిల్చినావు ||2||
కన్నతండ్రీ ఓ కాంతి ప్రదాతా
తనువు మనసే కానుకలయ్యా
నిరతం అర్పించి కొలిచెదమయ్యా
||ప్రేమతో|| ||ఉత్థాన||
2. సిలువపై బలియైన ఓ యేసుక్రీస్తువా
రక్త తర్పణ చేసి రక్షించినావా
మోక్ష మార్గము మాకు చూపించినావా ||2||
ఏమి ఇచ్చి నీ రుణము తీర్చాలి దేవా
ఎద సుమములతోని మాలను కూర్చి
సమర్పించెదను శిరమును వంచి
||ప్రేమతో|| ||ఉత్థాన||