Type Here to Get Search Results !

ఉప్పొంగిన హృదయం అర్పించే ( uppongina hrudhayam arpinche Song Lyrics | Jesus Songs in Telugu Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. మదనిస........నిసగస.....గమదని......సగసని

సనిద నిదమ దమగ మగస 

సగమ గమద మదని దనిస 

ససగగమమ గగమమదద 

మమదదనిని మమదదనిని 


ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిదే 

స్వీకరించు శ్రీకరా సుతుని చిన్న కాన్కలను ||2|| 


1. తనువు తలపు మనసు స్వేచ్ఛ 

నీవిచ్చిన వరములుగా ||2|| 

చేకొని దీవించుదేవ 

నీ చిత్తము పాటించగా ||2|| 

పాలించుము ప్రేమతో 

నీ పూజలు నే సేతును ||2|| 


2. అభయుడను అల్పుడను

ఇంతకన్న ఇవ్వలేను ||2|| 

అప్పద్రాక్ష రసములను 

అమరముగా చేయనీవు ||2|| 

అర్పింతును అందుకో 

అమరుడ నీ సేవకై ||ఉ|| 


3. నీవేకదా సర్వసృష్టి 

నీకవసరమేమున్నది ||2|| 

నా జీవిత భాగ్యమును 

నాకున్నవి సకలమును ||2|| 

అవసరమగు సేవకై 

నా యర్పణ చేకొనుము ||ఉ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section