Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏసయ్యా నీ వాక్యము నా త్రోవకు దీపము
ఆదియును అంతమును సర్వము నీ వాక్యం
మార్గమును సత్యమును జీవము నీ వాక్యం
1. ఎండిపోయిన బ్రతుకులకు జీవమిచ్చును నీ వాక్యము
బండ గుండెను కరిగించి రాగాలు పలికించు నీ వాక్యము
నీ వాక్య ప్రేరణలో మమునిలుపుమా
నీ ప్రేమ మార్గములో మము నడుపుమా
2. అంధకారపు లోయలలో వెలుగునిచ్చును నీ వాక్యము
అలసిసొలసిన మనసుల్లకు ఊరట నిచ్చును నీ వాక్యము
నీ వాక్య ప్రేరణలో మమునిలుపుమా - నీ ప్రేమ మార్గములో మము నడుపుమా