Type Here to Get Search Results !

ఏ యోగ్యత లేని ( a yogyatga leni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: ఏ యోగ్యత లేని నన్ను నీవు 

ప్రేమించినావు దేవా 

ఏ ఆర్హత లేని నన్ను నీవు

రక్షించినావు ప్రభువా

నీ కేమి చెల్లింతును

నీ రుణమెలా తీర్తును 


1. కలుషితుడైన పాపాత్ముడను

నిష్కళంకముగా నన్ను మార్చుటకు

పావన దేహములో గాయాలు పొంది

రక్తమంత చిందించినావా ||నీ|| 


2. సుందరమైన నీ రూపమును

మట్టి వంటి వాడనైన నాకీయుటకు 

వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి

నీ సొగసును కోల్పోయినావా ||నీ|| 


3. పాపమువలన మృతినొందిన

అపరాధినైన నను లేపుటకు 

నా స్థానమందు నా శిక్షని భరించి

మరణించి తిరిగి లేచినావా


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section