Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 6
పర్వతమైనా కాకపోతిని - నీ పాదస్పర్శ నాకుండేది
కొండనైనా కాకపోతిని - నీ పాదతాకిడికి మైనంలా
కరిగేవాడిని కడలినైనా కాకపోతిని - నీ పాద ఉనికి
నాకుండేది పాదమా యేసుని పాదమా (4)
శరణం నీవే శరణం యేసూ నీ పాదమే శరణం (2)
1. గలిలియ సంద్రమందు తుఫానును ప్రశాంతముగా మార్చిన ఓ పాదమా (2)
కన్నీటి సంద్రమైన నా జీవితమును మార్చుము ఓ పాదమా (2) ||శరణం ||
2. రక్తం కారుతున్నా - పడిపోయినా ప్రేమతో సిలువను మోసిన ఓ పాదమా (2)
జాలిని చూపించి, కరుణతో నన్ను రక్షించిన పాదమా (2) ||శరణం||