Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: భజన చేయుడి ప్రభు ఏసు ఘన నామం -
విజయముగా ఇల ఎల్లపుడు
1. మానవ కోటికి మార్గము చూపిన -
మన ప్రభు యేసుని మదిని తలంచుచు ||భజన||
2. ధర పాపములను కరుణతో మోసిన-
మరియ తనయుని యిల మరి మరి వేడుచు ||భజన||
3. యేసే జీవం యేసే మార్గం-
యేసే సత్యము నిత్యము యేసే ||భజన||
4. మతములు వెదకిన వ్రతములు కోరిన
పతిత పావనునిల సతతము మొక్కుచు ||భజన||