Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
బాల యేసువా - నీతి సూర్యుడా
బాల యేసువా - దివ్య బాలుడా
ఆశా జ్యో తివి నీవెనయా
మాకిల స్వర్గం నీవెనయా .
1. దావీదు పుత్రుడవు - మరియ తనయుడవు
పాపుల పెన్నిధివి - దీనుల కాపరివి
పూజింతును - ప్రణుతింతును
ప్రేమించి సేవించి తరియింతును ||బాల||
2. సాధుశీలుడవు - వినమ్రహృదయుడవు
జీవ పూర్ణుడవు - దీర్ఘశాంతుడవు
పూజింతును - ప్రణుతింతును
ప్రేమించి సేవించి తరియింతును ||బాల||
3. ప్రేమ స్వరూపుడవు - దేవుని కొమరుడవు
సిలువను మోసిన కల్వరి నాధుడవు
పూజింతును - ప్రణుతింతును
ప్రేమించి సేవించి తరియింతును ||బాల||