Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకీ :బాలయేసువా మనవుల వినుమా `
దైవ తనయా దీవెనలిడుమా
పల్లవి:మనవులు వినుమా మా బాలయేసా
మము దయగనుమా ఓ దివ్యతేజ
నిను చేరి ప్రార్థించు భక్తుల నెల్ల ||2||
ప్రియమార దీవించు కరుణాల వాల ||2||
1 వ చరణం..
తల్లివి నీవై తండ్రివి నీవై బంధువు నీవై తోడుండెదవే
రాజువు నీవై ప్రాణము నీవై పెన్నిధి నీవై పాలించెదవే
నీ దరి చేరిన పాపుమయ్యా ||2||
దీవించుమయా దీన బాంధవా `
దీవెనలిడుమా ఓ దైవతనయా llమనll
2 వ చరణం..
చింతలలో శోకములో శరణము నీవే
బాధలలో వేదనలో అభయము నీవే
నీ దరి చేరిన దీనులమయ్యా ||2||
దీవించుమయా ఓ బాలయేసా
దీవెనలిడుమా మా బాలయేసువా llమనll
3 వ చరణం..
మార్గము నీవై సత్యము నీవై `
జీవము నీవై నడిపించెదవే ||2||
కాపరి నీవై మా ఊపిరినీవై సర్వము నీవై
నీ దరి చేరిన బిడ్డలమయ్యా ||2||
కాపాడెదవే ` దీవించుమయా కరుణాలవాలా
దీవెనలిడుమా ఓ దివ్యబాల llమనll