Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
బాలుడా చిన్ని బాలుడా -
బాలుడా ముద్దు బాలుడా
1. అర్ధరాత్రి కాలమందు బాలుడా -
అవతరించినావయ్యా బాలుడా
అర్ధరాత్రి కాలమందు అవతరించినావయ్యా బాలుడా
2. పశువులకొట్టమందు బాలుడా -
పవ్వళించినావయ్య బాలుడా
పశువుల కొట్టమందు పవ్వళించినావయ్యా బాలుడా
3. పరమండలము నుండి బాలుడా -
పరమ దూతలొచ్చిరయ్యా బాలుడా
పరమండలము నుండి పరమ దూతలొచ్చిరయ్యా బాలుడా
4. కన్యాకుమారుడవయ్యా బాలుడా -
కరుణతోడ బ్రోవరయ్యా బాలుడా
కన్యాకుమారుడవయ్యా కరుణతోడ బ్రోవరయ్యా బాలుడా
5. మరియాంబ పుత్రుడవయ్య బాలుడా -
మాపాలి తండ్రివయ్యా బాలుడా
మరియాంబ పుత్రుడవయ్యా మాపాలి తండ్రివయ్యా బాలుడా
6. ఎనిమిదవ దినమందు బాలుడా -
యేసు పేరు పెట్టిరయ్యా బాలుడా
ఎనిమిదవ దినమందు యేసు పేరు పెట్టిరయ్యా బాలుడా