Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1:-
బాలురైన మమ్మును బాగుగాను దీవించి
యేలు పుణ్య ద్రోవలో –నేక త్రీత్వ దేవుడా
రేపు మాపు నెప్పుడన్ ప్రాపు కారుణ్యంబు జూపు
పాప రాశి తాపము – బాపియేసు కావుము || రేపు ||
2:-
మీరు భూమియందును మమ్ము చేరియుండగా
కోరి చిన్న వాండ్రను గారవింప పిల్చిరి || రేపు ||
3:-
దిట్టమైన ప్రేమతో చిన్నవాండ్ర బిల్చియు
పట్టుగాను వాన్ద్రకు- గట్టి దీవెనిస్తిరి || రేపు ||
4:-
మాకు నట్టి దీవెనన్ – మానుగాను నిచ్చుచు
జోక తోడ చాలిన జాలి ప్రేమ నుంచుము || రేపు ||